జల్లికట్టు నిర్వహించరాదని ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు పదే పదే చట్టం తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీసులు కట్టడిచేయక గోహింసను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జల్లికట్టు నిర్వహణకు పాత్ర పోషిస్తు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గోవధ కంటే గోహింస మహా పాపం, తెలిసి, గోవధపై ఉన్న ఆంక్షలు, అదే పశువులను నడి బజార్లో, జల్లికట్టు పేరుతో, హింసిస్తూ పరుగుపందెము చేపడుతూ, ప్రైజులు పెట్టించి, గోవులకు వేడుకగా వాటికి
ప్రభలు కట్టించి, నడి వీధిలో జల్లికట్టు ఉత్సవాలలో పరుగెత్తించారు. జల్లికట్టు నిర్వాహకుల యత్నంలో ఆ గోవులను హింసిస్తూ పరిగెత్తుస్తుంటే, ఆ గోవులు
కన్నులనుండి, కారుతున్న కన్నీరు, భీతి, ఆ గోవులపై వేస్తున్న గట్టిదెబ్బలు, గుద్దులు, గోపధకంటే దారుణమైనదని, గుర్తించక జల్లికట్టు నిర్వహణ జరిగిస్తూ ఉంటే సంబంధిత పోలీస్ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పండుగ పేరుతో జల్లికట్టు కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ప్రమాదకరమైన జల్లికట్టును వేడుకగా కొంతమంది రాజకీయ పెత్తందారుల వత్తాసులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎద్దులు చేరుకొని పండుగను భారీ ఎత్తున నడుపుతున్నారు.
jallikattu
తమిళనాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని జల్లికట్టు లో ఒక బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని సిరవాయల్లో జల్లికట్టు పోటీ జరుగుతోంది. ఈ పోటీలను సహకార శాఖ మంత్రి కెఆర్ పెరియ కరుప్పన్ ప్రారంభించారు. ఈ పోటీలో ఆన్లైన్లో నమోదైన 271 ఎద్దులను గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి విప్పుతున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు, ఆవుల యజమానులకు బహుమతులు అందజేయనున్నారు. అంతకుముందు మంజువిరాటు ఉత్సవ సమన్వయకర్త వేలుచ్చామి ఆధ్వర్యంలో పెరియనాయకి, తేనాక్షి అమ్మన్ ఆలయంలో శమీ దర్శనం ముగించుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. అక్కడి నుంచి ఎద్దులను ఒకదానికొకటి విడిచిపెట్టి. 800 మంది వరకు పోలీసుల రక్షణలో పాల్గొంటున్నారు. పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ పోటీలను ప్రారంభించారు. బృంగటికి చెందిన భాస్కరన్ (13) అనే బాలుడు ఎద్దును పట్టుకోవడానికి వెళ్లి ఢీకొని మృతి చెందాడు. అలాగే 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
కోటచంబగిరి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి బుధవారం జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి నిర్వహిస్తే, వైసీపీకి చెందిన కొంతమంది పార్టీకి సంబంధించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు. బ్యానర్లను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీకి చెందిన వారిని అడిగారు. కాగా జల్లికట్టును మేమే నిర్వహిస్తున్నామని వైసిపికి చెందిన పలువురు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. నగేష్, మరియు మురగ రాజ్ పై వాలంటీర్ సోకమ్మ భర్త సొము, వైసిపికి చెందిన సంజయ్, నవీన్, రాజేంద్ర లు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నగేష్, మురుగరాజుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కావాలనే తమపై వైసీపీకి చెందినవారు దాడి చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నగేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
చిత్తూరు సెంటర్ పలమనేరు బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వందలాది సంఖ్యలో పాల్గొన్న ఎద్దులు, లేగ దూడలను సైతం మత్తుతో పరుగులు పెట్టించిన నిర్వాహకులు, రేసులో గెలుపుకై కడుపును బిగుతైన దారంతో బంధించి తోకను నొప్పికి గురిచేసి ప్రైజ్ కొట్టేలా పైసాచికత్వం. లక్షల్లో ప్రైజ్ మనీ ప్రకటించిన నిర్వాహకులు, మూడు రాష్ట్రాల నుంచి పోటీకి దిగబడ్డ పశు యజమానులు, వేలాది గా పాల్గొన్న గ్రామీణ ప్రజలు, కనుమరుగైన పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహణ, మొదటి బహుమతి గా లక్ష రూ ప్రకటించిన నిర్వాహకులు, డబ్బు రూపంలోనే ఇంకా 40 బహుమతులను పొందనున్న యజమానులు, వాట్సప్ గ్రూపుల ద్వారా జల్లికట్టు పోటీలను ప్రచారం చేసిన నిర్వహణ సంఘం




Total views : 56808