వేములవాడ క్షేత్రంలో భక్తుల పై పెరిగిన భారం….

Vemulawada field

Advertisements

&NewLine;<p>పేదల దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువైయున్న వేములవాడ క్షేత్రంలో భక్తులపై వసతి గదుల భారం పెరిగింది&period; వసతి గదుల అద్దెను పెంచడంతోపాటు 100 రూపాయల అద్దె ఉన్న గదికి సైతం 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించడం వల్ల భక్తులపై భారం తడిసి మోపెడవుతోంది&period; గదుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రాజన్న ఆలయ అధికారులు కొత్త ధరల ప్రకారం అద్దెలు వసూలు చేస్తున్నారు&period;&period; గతంలో వెయ్యి రూపాయలు దాటిన గదికి మాత్రమే జీఎస్టీ పన్ను వసూలు చేయగా&comma; తాజాగా వంద రూపాయల గదికి కూడా 12 రూపాయల జీఎస్టీని వసూలు చేస్తున్నారు&period; అద్దె గదుల ధరలను స్వల్పంగానే పెంచినప్పటికీ ప్రతి గదికి జీఎస్టీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో భక్తులపై భారం అధికమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది&period; భీమేశ్వర అతిథి గృహం&comma; నందీశ్వర కాంప్లెక్స్ లోని ఏసి సూట్ గదులకు 2200 రూపాయల అద్దె ఉండగా దానిని 2500 పెంచారు&period; 300 రూపాయల జీఎస్టీతో కలిపి వీటి అద్దె 2800 వందలకు చేరింది&period; అమ్మవారి అతిథి గృహంలో వెయ్యి రూపాయల అద్దె ఉండగా దానిని 1500 రూపాయలకు పెంచారు&period; జీఎస్టీతో కలిపి భక్తులు 1680 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది&period; నందీశ్వర కాంప్లెక్స్ లో నాన్ ఏసీ గది 350 రూపాయలు ఉండగా దానిని 150 రూపాయలు పెంచి 500 రూపాయలు చేశారు&period; దీంతో జీఎస్టీ కలిపి 560 చెల్లించాల్సి ఉంటుంది&period; పార్వతీపురం బ్లాకులలో 500 రూపాయల అద్దె ఉండగా 600 కు పెంచారు&period; జీఎస్టీతో కలిపి 672 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది&period; పార్వతిపురంలో సాధారణ 200 రూపాయలు ఉండగా వంద రూపాయలు పెంచి 300 రూపాయలు చేయగా జీఎస్టీతో కలిపి 336 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది&period; లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో 250 రూపాయలు ఉండగా 150 రూపాయలు పెంచి 400 రూపాయలు చేశారు&period; జీఎస్టీతో కలిపి 448 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది&period; శంకరపురం ధర్మశాలలో 50 రూపాయలు ఉండగా దానిని వంద రూపాయలు చేశారు&period; జీఎస్టీతో కలిపి 112 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది&period; భీమేశ్వర సదన్ లోని గదుల అద్దెలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..