70
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసిప్రాణం తల్లి గర్భంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మోరి.. అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి అనే గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలో ఉన్న బేబీ మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు లత వైద్యం సక్రమంగా అందిచక పోవడంతో గర్భంలో ఉన్న బేబీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ ఆదేశాలు కూడా లెక్కచేయలేదని మండిపడుతున్నారు. తమకు ఏం చేయాలో తెలీయక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే అప్పటికే బేబి మృతి చెందినట్లు తెలిపారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లతపై కఠినచర్యలు తీసుకోవాలని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.