రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి లో మంచాల్ మండల గ్రామాలలో సుమారు 136 సిసి కెమెరాలు ప్రధానమైన చోట్ల పెట్టడం జరిగింది. మంచాల్ మండల పోలీస్ స్టేషన్ లో రాచకొండ సి పి, సుధీర్ బాబు సిసి కెమెరాలను ఆవిష్కరించడం జరిగింది. సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయం. ప్రజా ప్రతినిధులను అధికారులను అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సిసి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు. నేరాలు చేసే వారికి కట్టిన శిక్షలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగ చెడిపోవడానికి కారణాలు అవుతాయి. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు యువతకు విద్యార్థులకు ప్రతి ఒక్కరు వారికి సరైన సలహాలు సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.. కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు, డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసిపి శ్రీనివాస్, సీఐ కాశీ విశ్వనాథ్.. స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడెంట్ పలువురు పాల్గొన్నారు.
గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు..
87
previous post