భారత్‌… అమెరికాకు కీలక భాగస్వామి -మార్కో రుబియో..

భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి -మార్కో రుబియో

Advertisements

<p>అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు&period; అమెరికా&comma; భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు&period; భారతదేశానికి చెందిన కంపెనీలు తమ దేశంలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు&period; భారత్‌కు ముడి చమురు సరఫరా చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు&period; నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మార్కో రుబియో భారత్‌కు వచ్చారు&period; ఢిల్లీలోని సేవాతీర్థ్‌లో దాదాపు గంటసేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యిరు&period; భద్రత&comma; వాణిజ్యం&comma; సాంకేతిక రంగాల్లో అమెరికా-భారత్ సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు మార్కో రుబియో తెలిపారు&period; ప్రధాని మోదీకి&comma; ట్రంప్‌కు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు&period; వారిద్దరు కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తారని అన్నారు&period; ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆ దేశం గురించి కూడా మార్కో రుబియో ప్రస్తావించారు&period; ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !