ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..

ఫ్రాన్స్‌లో క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం

Advertisements

<p>క్రూయిజ్‌ షిప్స్‌లో వైరస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి&period; ఇటీవల హంటా వైరస్‌ భయాందోళనలకు గురి చేసింది&period; తాజాగా &&num;8216&semi;యాంబిషన్&&num;8217&semi; అనే క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ వ్యాప్తి చెందడంతో ఫ్రాన్స్‌‌లో కలకలం రేగింది&period; దాదాపు 1700 మంది ప్రయాణికులు&comma; సిబ్బందితో బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఈ నౌకను ఫ్రాన్స్‌‌లోని బోర్డెక్స్ పోర్టులో అధికారులు నిలిపివేశారు&period; నౌకలోని సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు&comma; విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు&period; దీంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ అధికారులు నౌకను తాత్కాలికంగా క్వారంటైన్ చేశారు&period; మే 10à°¨ నౌకలో 92 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ప్రకటించింది &&num;8216&semi;అంబాసిడర్ క్రూయిజ్ లైన్&&num;8217&semi;&period; అయితే&comma; అతడి మరణానికి&comma; ఈ వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని&comma; మృతుడికి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది&period; వైద్య బృందాలు నౌకలోని వారి నుంచి నమూనాలు పరీక్షించి అది నోరోవైరస్ వ్యాప్తిగా నిర్ధారించారు&period; అనంతరం&comma; ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులు నౌక నుంచి దిగేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు&period; వైరస్ సోకిన వారికి నౌకలోనే ఐసొలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు&period; ఇటీవల మరో నౌకలో వ్యాపించిన హంటా వైరస్‌కు&comma; ప్రస్తుత నోరోవైరస్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు&period; నౌకలో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు&comma; ప్రయాణికులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు క్రూయిజ్ సంస్థ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..