5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..

5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

Advertisements

<p>ఐదు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి బయలుదేరారు&period; నేటి నుంచి 20 వరకు యూఏఈ&comma; నెదర్లాండ్స్&comma; స్వీడన్&comma; నార్వే&comma; ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు&period; ఆయా దేశాలతో వాణిజ్యం&comma; సాంకేతికత&comma; ఇంధనం&comma; ఆవిష్కరణలు&comma; హరిత వృద్ధి వంటి రంగాలలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు చర్చలు జరపనున్నారు&period; అలాగే యూరప్&comma; గల్ఫ్ ప్రాంతాలతో భారత్‌ సంబంధాలను మరింత పటిష్ఠం చేయనున్నారు&period; ఆరు రోజుల పాటు ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాని మోదీ మే 15à°¨ యూఏఈ పర్యటనతో తన విదేశీ యాత్రను ప్రారంభిస్తారు&period; అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలుస్తారు&period; నెహ్యాన్‌తో ఇంధన సహకారం&comma; వాణిజ్యం&comma; పెట్టుబడులు&comma; ప్రాంతీయ సమస్యలపై చర్చిస్తారు&period; యూఏఈ పర్యటన తర్వాత నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు&period; అక్కడ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరపడంతో పాటు&comma; కింగ్ విల్లెం అలెగ్జాండర్&comma; క్వీన్ మాక్సిమాలను కలవనున్నారు&period; ఈ పర్యటనలో సెమీ కండక్టర్లు&comma; గ్రీన్ హైడ్రోజన్&comma; ఆవిష్కరణలు&comma; రక్షణ రంగం&comma; నీటి నిర్వహణ వంటి రంగాలపై ప్రధాని మోదీ దృష్టి సారించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>మే 19à°¨ నార్వేలోని ఓస్లోలో జరగబోయే మూడో భారత్-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు&period; అనంతరం నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు&period; ఈ శిఖరాగ్ర సమావేశంలో డెన్మార్క్&comma; ఫిన్లాండ్&comma; ఐస్‌లాండ్&comma; స్వీడన్ దేశాల నాయకులు కూడా పాల్గొంటారు&period; మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటించనున్నారు&period; ఇటలీ ప్రధాని జార్జియా మెలోని&comma; ఆ దేశ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాలతో మోదీ చర్చలు జరపనున్నారు&period; స్వచ్ఛ ఇంధనం&comma; రక్షణ&comma; సాంకేతిక రంగాలలో భారత్-ఇటలీ సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..