అమెరికా కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.

అమెరికా కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది&period; H-1B వీసాలపై కీలక తీర్పు వెలువడింది&period; విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది&period; ఇది చట్ట విరుద్ధమైన ఫీజు అంటూ వ్యాఖ్యానించింది&period; దీనిని US కాంగ్రెస్ కూడా ఆమోదించలేదని&comma; బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ వెల్లడించారు&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఫీజులు సవాలు చేస్తూ 20 మంది అటార్నీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోరోకిన్ తాజాగా తీర్పు చెప్పారు&period; దీంతో ట్రంప్‌కు షాక్‌ తగిలినట్లయింది&period; ఇక గతంలో ట్రంప్ సర్కార్ ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసాల‌ దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి&period; పాత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>సాధారణంగా H-1B ప్రోగ్రాం ప్రతి ఏడాది సుమారు 65 వేల వీసాలను అందిస్తోంది&period; అదనంగా ఉన్నత విద్యార్హతలు ఉన్నవాళ్లకు మరో 20 వేల వీసాలు లభిస్తున్నాయి&period; అయితే ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2000 డాలర్ల నుంచి 5వేల డాలర్ల వరకు ఉండేది&period; కానీ కొత్తగా ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజు కంపెనీలకు తీవ్రంగా భారం కానుంది&period; అయితే ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలో కొంతమంది సమర్థిస్తున్నారు&period; అమెరికా ఉద్యోగాలను రక్షించడం కోసం ఇలాంటి చర్యలు తప్పవని చెబుతున్నారు&period; విదేశీ ఉద్యోగులు తక్కువ ఫీజులతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని పేర్కొంటున్నారు&period; కానీ వీటిని కోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు&period; విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.