ఇరాన్ షాకింగ్ నిర్ణయం…

Advertisements

<p>ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది&period; కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ వదులుకోవడం లేదు&period; కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ వెల్లడించినట్టు తెలుస్తోంది&period;&period; యుద్ధానికి ముందు ఉన్నట్లుగా ఈ జలసంధిపై స్వేచ్ఛా రవాణా ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పాయి&period; ప్రతి నౌక ఇరాన్ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి&period; అంతేకాదు ఈ రవాణా నియంత్రణ కూడా ఇరాన్ సాయుధ బలగాలైన &&num;8216&semi;ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్&&num;8217&semi; IRGC పర్యవేక్షణలోనే ఉంటుందని ఇరాన్ తెలిపింది&period; ఇకనుంచి నౌకలు హర్మూజ్‌ను దాటాలంటే IRGC విధించే ప్రత్యేక రూల్స్‌ను పాటించడం&comma; అలాగే టోల్ చెల్లించాల్సి ఉంటుందనే సంకేతాలిచ్చింది&period; ఇక నౌకల రాకపోకలకు సంబంధించి ఆయా దేశాలతో IRGC నేరుగా అధికారిక చర్చలు జరుపుతుందని తెలిపింది&period; తమ పర్మిషన్ లేకుండా ఏ నౌక కూడా జలసంధిని దాటేందుకు వీల్లేదని కఠిన నిబంధనలను తీసుకొచ్చింది&period; ఈ ఆంక్షల వెనుక ఇరాన్ తన ఆర్థిక ప్రయోజనాలను కూడా లింక్ చేసింది&period; యుద్ధం వల్ల వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను ఈ రెండు వారాల కాల్పుల విరమణ గడువులోగా తమకు అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది&period; మొత్తానికి తాత్కాలికంగా కాల్పుల విరమణ కుదిరినా కూడా చమురు రవాణా&comma; ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.