లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులను తీవ్రతరం చేసింది…

Advertisements

<p>లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులను తీవ్రతరం చేసింది&period; ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసిం మేనల్లుడు&comma; వ్యక్తిగత కార్యదర్శి అయిన అలీ యూసఫ్ హర్షీ హతమయ్యాడు&period; బీరుట్‌లో అతన్ని హతమార్చినట్లు IDF ప్రకటించింది&period; అమెరికా&comma; ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది&period; ఈ మేరకు ఎక్స్‌లో IDF ఒక ప్రకటన విడుదల చేసింది&period; అలీ యూసఫ్‌&period;&period; హెజ్బొల్లా చీఫ్ ఖాసిం కార్యాలయ నిర్వహణలో&comma; భద్రత కల్పించడంలో హర్షీ కీలక పాత్ర పోషించాడని తెలిపింది&period; ఈ దాడితో పాటు&comma; లిటాని నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లతో పాటు&comma; దక్షిణ లెబనాన్‌లో 10 ఆయుధ నిల్వ కేంద్రాలు&comma; లాంచర్లు&comma; కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లు IDF పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>ఉత్తర ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీపడబోమని&comma; హెజ్బొల్లాపై దాడులను మరింత కఠినంగా కొనసాగిస్తామని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈయల్ జమీర్ స్పష్టం చేశారు&period; ప్రతి కార్యాచరణ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని ఆయన హెచ్చరించారు&period; మరోవైపు ఎవరైతే ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు పాల్పడతారో వారిని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు&period; తమ సందేశం చాలా స్పష్టంగా ఉందంటూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.