మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?

CITU State Vice President Kandarapu Murali

Advertisements

&NewLine;<p>అంగన్వాడీలు 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికైనా వెనుకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు&period; అంగన్వాడీలు కోరుతున్న వేతనాల పెంపు&comma; గ్రాట్యుటీ అమలు న్యాయమైన కోరికలని గుర్తు చేశారు&period; జనవరి 5వ తేదీ లోపు ఉద్యోగాల్లోకి రాకుంటే తొలగిస్తామని సిడిపిఓలు హెచ్చరికలు చేస్తున్నారని&period;&period; అంగన్వాడీల తొలగింపు కథ ఎలా ఉన్నా&comma; అధికార వైసిపీ తొలగింపు ఖాయం అయిందని ఎద్దేవా చేశారు&period; మంత్రి రోజా ఎన్నికలకు ముందు అంగన్వాడీలకే తన మద్దతని&comma; అసెంబ్లీలో తాను చేసిన గొడవ కారణంగానే జీతాలు పెరిగాయని గతంలో డప్పులు కొట్టేదని ఇప్పుడు మంత్రిగా ఉండి సమస్య పరిష్కరించక పోగా సిడిపిఓ ద్వారా అంగన్వాడీలను బెదిరించడానికి పూనుకుంటున్నదని మురళి విమర్శించారు&period; మహిళా మంత్రిగా ఉంటూ మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా&quest; అని ఆయన ప్రశ్నించారు&period; రాష్ట్ర ప్రభుత్వం ఊసుపోక కబుర్లతో కాలాన్ని గడపటం మానుకుని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు&period; ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని అన్ని పక్షాల మద్దతుతో రాష్ట్ర బంద్ కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు&period; తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల&comma; సెక్టార్ల నుంచి అంగన్వాడీలు 3500 మందికి పైగా కలెక్టరేట్ వద్ద బైఠాయింపులో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు ఆయాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు&period; గౌరవ వేతనం మాకొద్దు&comma; కనీస వేతనం కావాలి&comma; సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు&period; ఉదయం 10 గంటలకు ప్రారంభించిన బైఠాయింపు కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగించారు&period; అనంతరం కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద ప్రభుత్వం పంపిన నోటీసులను అంగన్వాడీలు దగ్ధం చేశారు&period; అంగన్వాడీలు సాగిస్తున్న పోరాటానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం &lpar;ఐద్వా&rpar; జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం&period; జయంతి&comma; పి&period; సాయి లక్ష్మి లు హాజరై మద్దతు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..