రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు, బోగస్ కార్డుల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసిని తప్పనిసరి చేసింది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇవ్వగా, అనంతరం ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు ఉంటే సమీపంలోని రేషన్ షాపుల్లోకి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు సమర్పించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లేదంటే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరాను నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు.. సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్, వేలిముద్రలు సమర్పించాలని సూచించారు. రేషన్ కార్డు కలిగిన వాళ్లు తెలంగాణాలోని ఏ రేషన్ షాపు వద్దనైనా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
మీ ఈ-కేవైసీ అయ్యిందా ? లేదా ?
116
previous post