అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్ ల ఆధ్వర్యంలో పట్టణం, మండలాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సచివాలయం సిబ్బంది తో అంగన్వాడీ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ ఇస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్లు చెపుతున్నారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన నాల్గవ రోజు కొనసాగుతోంది. అంగన్వాడీ సిబ్బంది నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడం సిగ్గు సిగ్గు అంటూ అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు.
తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాన్ని తెరవడం సిగ్గు సిగ్గు..
70
previous post