రైతుల పాలిట శాపంగా మారిన జగన్ పాలన..

crop field

Advertisements

&NewLine;<p>రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని&comma; నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు&period; గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు&comma; మునిపల్లె&comma; గొళ్ళముడిపాడు&comma; వెల్లలూరు తదితర గ్రామాలలో తుఫాను నేపథ్యంలో నీట మునిగిన పంట పొలాలను మంగళవారం ఆయన టిడిపి శ్రేణులు రైతులతో కలిసి పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతులకు మేలు చేసిందేమీ లేదన్నారు&period; గత సంవత్సరం తుఫాను సమయంలో దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు&period; వారం రోజులుగా తుఫాన్ గురించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ అధికారులను అప్రమత్తం చేయటంలో విఫలం అయ్యారని ఆరోపించారు&period; తుఫాను ప్రభావంతో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం పెద్ద పనుస్సుతో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు