సీఎస్‌ జి, సీసీఎల్‌ఏ సెక్రటరీ, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ…

CM jagan met with CGS, CCLA Secretary, CMO officials...

Advertisements

&NewLine;<p>తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌&period;జగన్‌ అధికారులతో సమీక్షించారు&period; క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ&comma; విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్&comma; సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్&comma; సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు&period; తుఫాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు&period; నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్&comma; సగం సముద్రంలో తుఫాను గమనం ఉందని అధికారులు తెలిపారు&period; చీరాల&comma; బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించారు&period; తిరుపతి&comma; నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు&period; తిరుపతి&comma; నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు&period; ప్రకాశం&comma; గుంటూరు&comma; కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు&period; ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు&period; వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు&period; సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు&period; నెల్లూరు&comma; తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు&period; మనుషులు&comma; పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు&period; తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు&period; గ్రామ&comma; వార్డు సచివాలయ&comma; వాలంటీర్‌ వ్యవస్ధలను వాడుకుని రేషన్‌ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..