ఈనెల 3న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. దెందులూరు ఆశ్రమం బైపాస్ సహారా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం సభలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదటమైన చర్యలు చేపట్టారు పార్టీ నాయకులు, అధికారులు. ఈ సభలో సుమారు 3లక్షల మంది వైసీపీ శ్రేణులు పాల్గొననున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు కృష్ణా జిల్లాల నుంచి పార్టీ క్యాడర్ తరలి రానుంది. సీఎం జగన్ సిద్ధం సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు పోలీసు అధికారులు. దెందులూరు వేదికగా జరిగే సిద్ధం సభ నుంచే పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. సభ వేదిక వద్ద ఎన్నికలకు సిద్ధం గజదొంగలు ముఠా నుంచి ప్రజల్ని కాపాడే ధీరుడు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పార్టీ నేతలు.
3న ఏలూరు జిల్లాలో జగన్ పర్యటన
75
previous post