జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం చాలా పురాతనమైంది. ఈ గుడి గుంటూరు జిల్లాలో ఉంది. సంగమేశ్వర దేవస్థానం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది. ఈ చారిత్రక దేవస్థానం విశిష్టంగా ఉంటుంది. ఒకపక్కన ప్రాచీనతను ప్రతిబింబిస్తూ మరో పక్కన అపురూపమైన శాంతి నిలయంలో ప్రవేశించిన భావన మనసులో నింపుతుంది. ఆలయ ప్రాంగణం లోంచి దేవస్థానంలోకి దారి తీస్తే, మున్గుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. తూర్పుముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా, కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు. గుడి ప్రాంగణంలో తూర్పుదిక్కున ప్రాకారానికి దగ్గర్లో పెద్ద సత్రం, ఆఫీసు ఉన్నాయి. ఉత్తర దిక్కున నాగ ప్రతిమలు, కాలభైరవుని విగ్రహం, యజ్ఞశాల ఉన్నాయి. దక్షిణ దిక్కులో కళ్యాణ మండపం, వీరభాద్రేస్వరాలయం,పార్వతీదేవి ఆలయం, పాప వినాశాకేశ్వరాలయం, నవగ్రహాలు కనిపిస్తాయి. ఇంకా ఈ గుడిలో అనేక చెట్లు, పాకశాల మొదలైనవి ఉన్నాయి. దాదాపు మన ప్రాచీన దేవాలయాలన్నీ దేవుడు ఆ ప్రాంతీయులు ఎవరి కలలో నయినా కనిపించి ఫలానా ప్రదేశంలో తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పి కట్టించుకున్నవే. కొన్ని మాత్రం పూర్వ మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమిలో కట్టినవి. గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట. తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట. అత్రి మహాముని కట్టించి నదేవస్థానం శిథిలావస్థకు చేరగా, 17వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
Read Also..
Read Also..