ఏలూరు జిల్లా చింతలపూడి ఎం హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని, రెండు పార్టీల అధినేతల నుండి వచ్చే ప్రధాన అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 11 ను రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజలలో తీసుకువెళ్లి రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకువస్తామని అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా.ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి ఎస్సి నియోజకవర్గం, కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఇవ్వకుండా వైయస్సార్ ప్రభుత్వం చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల. నాగేశ్వరరావు, చింతలపూడి టిడిపి మాజీ కన్వీనర్ జగ్గవరపు. ముత్తారెడ్డి, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం..
70
previous post