కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ…

Judicial inquiry on the Kaleshwaram lift scheme

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; యాదాద్రి&comma; భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం&comma; ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది&period; మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది&period; 100 రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తిచేయాలని కోరింది&period; కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని&comma; అధికారంలోకి వచ్చాక&period;&period; దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది&period; అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి&comma; నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు&period; ఇందుకోసం సిటింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా&comma; ప్రస్తుత న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది&period; దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది&period; అటు కాళేశ్వరం&comma; ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…