కడప తహసీల్దారు శివ ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన అనిశా కేంద్రీయ విచారణ విభాగం అరెస్టు చేసింది. నెల్లూరు అనిశా కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండు విధించారు. కడప తహసీల్దారుగా బదిలీ అయిన శివప్రసాద్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనిశా అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో శనివారం తిరుపతి, వైయస్ఆర్ జిల్లాల్లోని 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ‘కడపలో తహసీల్దారు శివప్రసాద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.37 లక్షల ప్రభుత్వ నగదును స్థానిక ఎన్నికల అధికారికి అప్పగించారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కోర్టులో అప్పగించారు. సోమవారం నుంచి బ్యాంకు లాకర్లు, ఖాతాల్లోని నగదు వివరాలను పరిశీలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
కడప తహసీల్దార్ అరెస్ట్.. రిమాండ్…
104
previous post