61
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని కమీషన్ల కోసం పీడిస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పరిశ్రమలలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో పారిశ్రామికవేత్తలు వెనుదిరుగుతున్నారని చెప్పారు. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడ్డాక రాజకీయ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పరిశ్రమలలో వాటా ఇవ్వకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
Read Also..
Read Also..