నరసాపురం నియోజకవర్గ కాపు సోదరులకు తలమానికంగా ఉండేందుకు కాపు తెలగ కళ్యాణ మండపాన్ని కోటి 50 లక్షల రూపాయలతో అధునాతన అంగులతో తీర్చిదిద్దామని దాత కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాపు తెలగ కళ్యాణమండపం నందు కాపు నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ మండపాన్ని ఈరోజు ప్రారంభించి ఆదివారం నియోజకవర్గ కాపు తెలగ కార్తీక వనసామరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారి తెలిపారు. ఈ సందర్భంగా కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి తమతో పాటు సహకరించిన కాపు సంఘ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాపు సంఘ నాయకులు డాక్టర్ చినుమిల్లి సత్యనారాయణ రావు చాగంటి సత్యనారాయణ పప్పుల రామారావు కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
అధునాతన హంగులతో కాపు కళ్యాణమండపం – నాయుడు
80
previous post