అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, అంగరంగ వైభవంగా కార్తీక మాస వేడుకలు. దీపావళి అనంతరం దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఇందులో భాగంగానే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ప్రతిరోజు శివుని ఆలయానికి వెళ్లి దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలలో దీపాలతో దీపారాధన చేస్తారు. కొంతమంది 365 దీపాలతో మరి కొంతమంది లక్ష దీపాలతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కార్తీకమాసంలోనే హిందువులు వనభోజనాలకు వెళ్లి సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకోడూరు పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్న భుజంగేశ్వర స్వామి ఆలయంలో రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి సహకారంతో భుజంగేశ్వర ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్తీకమాసం మొదటి రోజు నుండి నేటి వరకు అనగా నెల రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులతో లక్షలాది దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు తమ భక్తుని చాటుకున్నారు. ప్రత్యేకించి సోమవారాలలో అంగరంగ వైభవంగా పూజలు, అన్నదానాలు, భజన కార్యక్రమాలు, దీపారాధనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భుజంకేశ్వర ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. నాలుగవ కార్తిక సోమవారం నాడు మిచౌంగ్ తుఫాన్ సైతం లెక్కచేయకుండా జోరు వానలో హోరుగా అన్నదానాలు, భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులు పోటెత్తిపోయారు. కార్తీక మాసం పూలు పండ్లు, కాయ కర్పూరం లాంటి చిరు దుకాణాల వ్యాపారులకు కనక వర్షం కురిపించింది. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భుజంగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తిపోయారు. చివరి వారం కావడంతో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి భుజంగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైల్వే కోడూరు ప్రజలు, వర్తకులు, రైతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించాలని కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి తెలియజేశారు.
ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి- కొరముట్ల శ్రీనివాసులు
189
previous post