కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు..

Advertisements

<p>ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది&period; ఆలయం తెరిచిన మొదటి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు&period; ప్రారంభ రోజుల్లో భక్తుల్లో భారీ ఉత్సాహం కనిపించిందని&period;&period; అధికారిక గణాంకాల ప్రకారం తొలి రోజైన ఏప్రిల్ 22à°¨ అత్యధికంగా 38 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు&period; రెండో రోజు 25 వేల మందికి పైగా&comma; మూడో రోజు మరో 30 వేల మందికి పైగా యాత్రికులు కేదార్‌నాథ్ చేరుకున్నారని ఎస్పీ అన్నారు&period; భక్తుల భారీ తాకిడి నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు&period; జనసందోహాన్ని నియంత్రించేందుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారని&period;&period; ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీస్&comma; రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం&comma; జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని ఎస్పీ నిహారిక తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ మిశ్రా&comma; ఎస్పీ నిహారికా తోమర్‌తో కలిసి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు&period; యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వారు పర్యవేక్షించారు&period; ఈ సందర్భంగా యాత్రికులకు వారు కీలక సూచనలు చేశారు&period; ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం కేవలం పోలీసులు&comma; జిల్లా యంత్రాంగం తాలూకు అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని వారు విజ్ఞప్తి చేశారు&period; తప్పుడు సమాచారాన్ని నమ్మి ఇబ్బందులు పడొద్దని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.