77
ఓటరు లిస్ట్ పై ప్రతిపక్షాల చేస్తున్నఆరోపణలపై శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చొని ఎన్నికల ఓటరు లిస్టు సర్వేలను చూస్తే అక్రమాలు బయటపడవన్నారు. బీఎల్ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపించాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎవరైనా ఓట్లను తొలగించినా, అక్రమంగా నమోదు చేసిన వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసు వేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు. బీఎల్ఓ లు ఓటరు జాబితాను సరైన పద్ధతిలో రూపొందించాలని సూచించారు. ఒటరు ఉన్నాడా లేదా అనేది విచారణ చేసిన తర్వాతే ఓటరు నమోదు లేదా షిఫ్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలన్నారు.