ఓటరు లిస్ట్ పై ప్రతిపక్షాల చేస్తున్నఆరోపణలపై శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చొని ఎన్నికల ఓటరు లిస్టు సర్వేలను చూస్తే అక్రమాలు బయటపడవన్నారు. బీఎల్ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపించాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎవరైనా ఓట్లను తొలగించినా, అక్రమంగా నమోదు చేసిన వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసు వేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు. బీఎల్ఓ లు ఓటరు జాబితాను సరైన పద్ధతిలో రూపొందించాలని సూచించారు. ఒటరు ఉన్నాడా లేదా అనేది విచారణ చేసిన తర్వాతే ఓటరు నమోదు లేదా షిఫ్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలన్నారు.
Tag:
Voter list
పల్నాడు జిల్లా సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇరు పార్టీలు కూడా గ్రామస్థాయిలో సమన్వయముతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద నమ్మకం లేక నిజాయితీగా వెళ్ళలేక ఓటర్ లిస్ట్ తీసివేసి గందరగోళం సృష్టిస్తున్నాడు అన తేలిపారు. ఈ క్రిమినల్ బ్రెయిన్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించినట్లయితే బాగుండేది అన్నారు. ఎన్నికల సమయానికి ఓటమి భయంతో ఏ రకంగా నైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తున్నాడు. ఇరు పార్టీలు కూడా ఓటర్ లిస్టు విషయంలో జాగ్రత్త పడాలి అనుకున్నాం కన్నా తెలిపారు.