విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది. రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి ఉప్పు చేప కాదు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది. ప్రధాన నిందితులు వాసుపల్లి నాని, అతని మామ వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. ఈనెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్‌లో పార్టీ చేసుకున్నారు. మందులో నంజుకోవడానికి ఉప్పుచేపను వేయించారు. ఆ చేపను తిన్న తర్వాత మద్యం మత్తులో కాల్చిన సిగరెట్ ముక్క పక్క బోటులోకి విసిరేశారు. సిగరెట్ ముక్క బోటు ఇంజిన్ పై పడింది. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. మద్యం మత్తులో చేసిన ఈ చిన్న తప్పిదం గంగపుత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కళ్లెదుటే తమ జీవనాధారం బూడిదవ్వటంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం వేగంగా స్పందించి 49 మంది బాధితులకు ఏడు కోట్ల పదకొండు లక్షల నష్టపరిహారాన్నిఅందించి ఆదుకుంది.
ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక ఆధారాలు
82
previous post