137
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బొటిక్ నిర్వాహకురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బొటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసిఉన్నట్లు తెలిసింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.