65
దేశ ప్రజలంతా ఏకమై ఒక సుస్ధిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాలంటే దేశ ప్రజలంతా కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పటయ్యే దిశగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. అప్పడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. గణంతత్ర వేడుకలు సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. పద్మవిభూషన్ పురస్కారం పొందిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also..
Read Also..