గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) బీజేపీ(BJP) అభ్యర్థి కిషన్రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు.
ఇది చదవండి: ఆ ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం…
తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి