కరోనా టైంలో శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్లకు, నేను ఏమి సేవ చేసానో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర.
మచిలీపట్నంలో పేర్ని నాని గోతికాడ నక్కలా ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. పేర్ని నాని కొత్తగా బందరు ప్రజల మీద ప్రేమ పుట్టినట్లు కరోనాలో తండ్రి, కొడుకులు తెగ సేవ చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో మాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా బందరు ప్రజల కోసం చిత్తశుద్దితో ప్రాణాలను సైతం అడ్డుపెట్టి సేవ చేశామని కొల్లు తెలిపారు. ప్రజలకు విపరీతంగా సేవ చేశామని చెబుతున్న వాళ్లు తుఫాన్ సమయంలో సేవ చేయకుండా ఏ కలుగులో దాక్కున్నారని నిలదీశారు. నా కొడుకు ప్రజాసేవలో తరిస్తున్నాడని పేర్ని నాని చెబుతున్నాడని ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారా లేక నీ కొడుకుని గెలిపించారా అని ప్రశ్నించారు. ప్రజాసేవ ముసుగులో పిపిఏ కిట్లు, వ్యాక్సిన్లు అమ్ముకోవడం, మీ అవినీతి బాగోతం అంతా బందరు ప్రజల ముందు పెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
పేర్ని నాని పై కొల్లు రవీంద్ర ఆరోపణలు
72
previous post