అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన కోటి అక్షంతలు ఊరేగింపు కార్యక్రమం మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 22న కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అయోధ్య నుంచి మార్కాపురం పట్టణానికి వచ్చినటువంటి స్వామి వారి తలంబ్రాల అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద నుండి డప్పు కోలాట చప్పుళ్ల మధ్య అక్షింతల కలశాలతో శోభాయాత్రను నాలుగు మాడవీధులలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్తు అఖిల భారత ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు గారు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం రామచంద్రుని 600 సంవత్సరాల కల నేటికి తీరిందని ఈ యొక్క పవిత్రమైన అక్షింతలను జనవరి రెండవ తేదీ నుండి పట్టణ మరియు పరిసర ప్రాంతం గ్రామాలలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మరియు స్వామివారి రూపం, ఫోటోలను, ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 22వ తేదీ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, పలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా కోటి అక్షంతలు ఊరేగింపు…
89
previous post