‘‘దీక్ష’’(Deeksha) :
నేతన్నలకు మద్దతుగా 10న సిరిసిల్లలో జరిగే ‘‘దీక్ష’’(Deeksha)ను విజయవంతం చేయమని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల భేటీలో బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మే 1 నుండి 5 వరకు 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు యువ ఓటర్లు, వృద్దులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, అయినప్పటికీ అమలు జరిగినట్లుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
ఇది చదవండి : శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం…
ఈ విషయంపై వాస్తవాలు చెబుతూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. 18 నుండి 23 ఏళ్లున్న యువ ఓటర్లు అత్యంత కీలకమని, వీరితో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి మళ్లీ మోదీ ప్రదాని కావాల్సిన ఆవశ్యకతను వివరించాలని కోరారు. ప్రతి పోలింగ్ బూత్ లో గతంలో వచ్చిన ఓట్ల కంటే అదనంగా 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 370 సీట్లు రావాలని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లకుపైగా రావడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి