ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి. అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి రాజకీయ పార్టీ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఒక వ్యయాన్ని నమోదు చేయాలి. ఎన్నికల వ్యయ వివరాలు నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన లపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
వల్లూరి క్రాంతి అన్నారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై తీసుకోవాల్సిన చర్యలపై ఏ ఆర్ ఓ లు ఏ ఈ ఆర్ వో లు ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, లతో సమీక్షించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం మనమంతా భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలని, ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు.
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణిను గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, రికార్డు చేయడం చాలా కీలకమని, సి-విజల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇది చదవండి : ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!
విధుల్లో భాగంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు నగదు, ఇతర ఆభరణాలు సీజ్ చేసీనప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించ వద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని అన్నారు.
వీడియో సర్వేలెన్సు బృందాలు ,వీడియో వ్యూయింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, కుర్చీలు, స్టేజి, సౌండ్ ఏర్పాట్లు, భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు, రికార్డ్ చేయాలని అన్నారు.అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి