రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయ డంకా మోగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీ.ఎస్.పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాన్షిరాం జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. దోపిడీదారుడా కబంధహస్తాల నుండి విముక్తి కలిగించేందుకు దళితులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది కాబట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ, బి ఆర్ ఎస్ లౌకిక కూటమిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలనీ అన్నారు. ఈ దేశంలో బిజెపి మోడీ నాయకత్వంలో రాజ్యాంగం, ప్రజా హక్కులు ప్రమాదంలో ఉన్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన సాగుతోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అరాచకచక్తులు ఈ దేశాన్ని దోచుకుంటునయనీ ఈ దేశ సంపదను కార్పోరేటర్లకు కట్టబెడుతోందనీ ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే వారి నోళ్లు ముయిస్తూ కుట్రలు పన్నుతుంది మోడీ ప్రభుత్వాన్ని ఓడించి తీరాలన్నారు. దేశంలో ఒత్తిళ్లు, దుర్మార్గం వంటి చర్యలతో అందరి నోళ్లు ముగిస్తుంది. ఇలాంటి అరాచక శక్తులకు అంతం పలకాలంటే ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మతసామరస్యం లేకుండా హిందువులు, ముస్లిం మైనార్టీల హక్కులు కాలరాసి మతకల్లోలకు, కుట్రలు పండుతుంది బిజెపి ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లతో ప్రజలను వంచించేందుకు మరోవారు ముందుకు వస్తుందనీ అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు దేశంలో అస్థిరతకు మతోన్మాదానికి బీజాలు వేస్తుందనీ విమర్శించారు.
భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేవి బీఆర్ఎస్ బీఎస్పీ కూటమిలేనని అన్నారు. బీఎస్పీ కూటమి నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాలలో బరిలోకి దిగుతున్నాం …ఆశీర్వదించాలి కోరారు. దోపిడి బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి ఈ దేశాన్ని రక్షించాలనీ అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి