పదేళ్ళలో ఎమ్మెల్యేగా తాను చేసిన పనిని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కూకట్పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని కోరారు. మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, స్థానికుడైన తనకు పరిష్కరించిన, పరిష్కరించాల్సిన సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, బయట నుండి వచ్చిన వారికి నియోజకవర్గం పై అవగాహన కూడా లేదని, ఓటు వేసే ముందు అన్ని విధాలా ఆలోచించి అభివృద్ది, శాంతి భద్రతలతో మతసామరస్యాన్ని కాపాడుతున్న బిఆర్ఎస్ పార్టీ.ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు బోయిన్పల్లిలోని కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత భారీ ఎత్తున హాజరై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ గల్లి గల్లి కి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపుతూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు …హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ముల వలె ఇక్కడ నివసిస్తున్నామని.. తిరిగి మళ్ళీ ఇదే ప్రశాంతమైన జీవనం కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేయాలని తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళదామని కోరారు…
Read Also…
Read Also…