వరంగల్ (Warangal)జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన జాటోత్ రాజుకు ఎల్లాయగూడేనికి చెందిన మమతను ఇచ్చి 2017లో పెళ్లి చేశారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పారు.
దీంతో మమత.. భర్తతో కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తరువాత అత్త భద్రమ్మ, మామ నర్సింహ, మరిది శ్రీను మమత వద్దకు వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పి కాపురానికి తీసుకువచ్చారు. కానీ ఆ దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.
ఈ క్రమంలో ఓ రోజు నీ భర్త రాజుకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. ఈ విషయం నీకు తెలుసుకదా. నువ్వు (మరిది) శ్రీనుతో కలిసి కాపురం చేయగలిగితే నీకు పిల్లలు పుడతారని అత్తామామలు ఒత్తిడి చేశారు.
ఈ విషయాన్ని ఆసరా చేసుకొని మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఆస్తిపాస్తులు మనమే అనుభవిస్తామని నమ్మబలికిన శ్రీను మమతతో కాపురం చేస్తూ వస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు.
ఇన్నాళ్లు గుట్టుచప్పుడుగా సాగిన కాపురం. కొంతకాలంగా అత్తామామ, మరిదిలు తరచూ ఆమెతో గొడవ పడుతూ పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసి 20 రోజుల క్రితం ఆమెను కొట్టి పుట్టింటికి వెళ్లగొట్టారు.
అనంతరం శ్రీను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చి తార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మమత చిన్నతండాకు వచ్చి నిలదీసింది. శ్రీను.. ఆమెను దూషించి వేరే పెళ్లి చేసుకుంటానని తేల్చిచేపాడు. దీంతో మమత పోలీసులను ఆశ్రయించింది. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి