నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10ఏళ్ల కాలంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చేసిన పనులకు డబ్బులు రాక సర్పంచులు ఎంపీటీసీలు ఇబ్బందులకు గురయ్యారన్నారు.
కనీస గౌరవ మర్యాదలు సైతం ఇవ్వలేదన్నారు. పది సంవత్సరాల అవినీతి దుర్మార్గపు పరిపాలన కారణంగా చెప్పినటువంటి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్బంలో 2014 ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఒక నిరంకుశ పాలన ప్రజాస్వానికి పాలన కారణంగా ఆనాడు నటువంటి ప్రగతి భవనకు ఎంట్రీ లేదు. ఈరోజు సెక్రటేరియట్ లో కాలు పెట్టకుండా మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగదిపాదేశీ అప్పుల ఊబీలో ముంచినటువంటి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు శాసనసభ ఎన్నికలు ప్రజలు గొప్పగా తీర్పు ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇచ్చేందుకు పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులు ఎలా ఇంటికి పోవడం జరిగిందన్నారు.