రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానుండగా, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతోపాటు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర నేతలు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 50 వేల మందికిపైగా మహిళలే బహిరంగ సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పదేండ్ల పాటు కళాక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేయగా, సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే ఛాలెంజింగ్ గా తీసుకుని దానిని ఓపెనింగ్ కు సిద్ధం చేశారు. అంతేగాకుండా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం ఇక్కడే శిలాఫలకం వేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అయ్యప్ప దర్శనానికి 10 గంటలుశబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ…
- కాగ్ చీఫ్ గా తెలుగు ఐఏఎస్ కె.సంజయ్ మూర్తికంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి…
- రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాందేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో…
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇక జైలు కేనా ..?ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావు…
- ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లురాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి