తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. జీవో 41 ద్వారా తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ 2026, డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని.. దీనిద్వారా వినియోగదారులకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యం కాకూడదనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రవేశ పెడుతున్నామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే సిటీలో మొత్తం ఈవీ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలుప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో .. అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా…
- మణిపూర్ పై కాషాయపార్టీ కుట్రమణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో…
- కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగుకాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత…
- బీఆర్ఎస్ ను కాపాడేందుకు రంగంలోకి బీజేపీతెలంగాణ బీజేపీ తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
- మట్టి మాఫియా తో చేతులు కలిపిన అటవీ అధికారులుఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి, కంకర తవ్వకాలను చేపడుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి