లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదని జితేందర్ రెడ్డి అన్నారు. మాది ఒక్కటే జిల్లా… నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదన్నారు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడని జితేందర్ రెడ్డి తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత ఇంటికి రేవంత్ రెడ్డి…
57
previous post