ప్రజా పాలన కార్యక్రమం పై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పనిసరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జరుగు ప్రతిష్టాత్మక ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి జిహెచ్ఎంసి పరిధిలో నియమించిన సర్కిల్ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు ఏర్పాట్లను సమీక్షించారు.
ప్రజా పాలన కార్యక్రమం పై సమీక్ష…
68
previous post