నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం పై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపు కొనసాగింది. బాజాభజంత్రీలతో, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణలతో రథోత్సవం ముందుకు సాగింది. ఆలయ ట్రస్టు చైర్మన్ రాజ ఆదిత్య లక్ష్మణ్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు రథోత్సవం ముందు భక్తులు మధ్య నడిచారు. స్వామివారి రథోత్సవం తిలకించడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారి రథోత్సవానికి తరలివచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి లక్ష్మీదేవమ్మ గుట్ట శ్రమి వృక్షం దగ్గర రథోత్సవాన్నికి పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం దగ్గరికి తిరిగి చేర్చారు. సాంప్రదాయ ప్రకారము చెంచులకు నరసింహ స్వామి అల్లుడు కావడంతో పూజలో చెంచులు, మహిళలు పాల్గొన్నారు. రథోత్సవాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు.
ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…
63