తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఫైల్స్ చోరీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు మాయమైనట్టు గుర్తించిన కార్యాలయ వాచ్‌మన్ ఫిర్యాదుతో కల్యాణ్ సహా ఐదగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కల్యాణ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ చాంబర్ ఉంది. గత శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి కీలక పత్రాలతోపాటు హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. కార్యాలయ తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన వాచ్‌మన్ లోపలికి వెళ్లి చూడగా ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను కళ్యాణ్ ఖండించారు.