ప్రజల ఆస్తికి భద్రతలేని ఏపీ భూహక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో న్యాయవాదుల సంఘం నిరసన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి నరసాపురం పట్టణం అంబేద్కర్ సెంటర్ లో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని ఇది ఒక చీకటి చట్టం అన్నారు. ప్రజల ఆస్తికి ఎటువంటి భద్రత లేని ఈ చట్టాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నరసాపురం కోర్ట్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం లోని న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
న్యాయవాదుల సంఘం నిరసన
79
previous post