68
మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్ సంస్థ ముగింపు పలికింది. ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతాల్లో ప్రభావితంగా ఉన్న పురాతన సాయుధ సమూహం యూఎన్‌ఎల్‌ఎఫ్ హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరడానికి అంగీకరించినట్లు చెప్పారు. పురోగతి పథంలో ప్రయాణించేందుకు ప్రజాస్వామ్యంలోకి వారిని స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. యూఎన్‌ఎల్‌ఎఫ్ క్యాడర్ తమ ఆయుధాలను అప్పగించిన వీడియోను కూడా షేర్ చేశారు.