హుస్నాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, వార్డు కౌన్సిలర్లతో మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు. హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని, పరిష్కారమార్గం చూపెడదమని పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేస్తానని, ఏ సమస్యలు ఉన్న మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చునన్నారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా గౌరవెల్లి ప్రాజెక్టు ను అందరి సమక్షంలో ప్రారంభించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటి, వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో వసతులపై రోగులను అడిగి ఆరా తీశారు.
హుస్నాబాద్ ను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం – మంత్రి
58
previous post