ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తా మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల పాటు మనుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఎవరు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ను ఐదువేల రూపాయలకు పెంచుతామన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ 80 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని రెండుసార్లు కోరామని కేసీఆర్ తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తాం – కేటీఆర్
69
previous post