ప్రభుత్వంపై హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. డిసెంబర్ 9న రైతుబంధు డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ 9వ తేదీ రైతుబంధుపై ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు. ఈ లెక్కన యాసంగి సీజన్ లో రైతుల ఖాతాల్లో రూ.7,500 చొప్పున జమ చేయాలి. రైతుబంధు ఎప్పటి నుంచి ఇస్తారు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Rythu Bandhu
తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తా మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల పాటు మనుగోడు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఎవరు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ను ఐదువేల రూపాయలకు పెంచుతామన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ 80 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని రెండుసార్లు కోరామని కేసీఆర్ తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.





Total views : 79904