81
తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంత ఓకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు. తాము కష్టపడి పని చేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరుపాలని కోరుతున్నామని, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.